© 2026 nimisham.in

దిల్లీ: భరణం నిమిత్తం భార్యకు ఇవ్వాల్సిన మొత్తం ఆమె ప్రాథమిక అవసరాలకు సరిపోకపోయినా భర్త సంపాదనకు మించిన మొత్తాన్ని ఇవ్వాలనే ఆదేశాలు ఇవ్వలేమని దిల్లీ అదనపు సెషన్స్ న్యాయమూర్తి పర్వీన్ సింగ్...
దిల్లీ: భరణం నిమిత్తం భార్యకు ఇవ్వాల్సిన మొత్తం ఆమె ప్రాథమిక అవసరాలకు సరిపోకపోయినా భర్త సంపాదనకు మించిన మొత్తాన్ని ఇవ్వాలనే ఆదేశాలు ఇవ్వలేమని దిల్లీ అదనపు సెషన్స్ న్యాయమూర్తి పర్వీన్ సింగ్ పేర్కొన్నారు. నెలకు రూ.1,840 చొప్పున తాత్కాలిక మొత్తం తనకు చెల్లించాలని మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ భార్య దాఖలు చేసిన పిటిషన్ను ఆయన కొట్టివేశారు. దిల్లీలో బతకడానికి ఆ మొత్తం సరిపోదనేది నిర్వివాదాంశమే అయినా భర్త ఆదాయాన్నీ పరిగణనలో తీసుకోవాలని స్పష్టంచేశారు. మందుల షాపులో సహాయకునిగా పనిచేసే తనకు నెలకు రూ.8,000 జీతమే వస్తుందని భర్త చెప్పడాన్ని న్యాయమూర్తి పరిగణనలో తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.