© 2026 nimisham.in

90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్లో ఉన్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది.
Sep 2 2026 8:30 PM | Updated on Sep 2 2026 9:07 PM
90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్లో ఉన్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే పలు భాగాలు రిలీజయ్యాయి. కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో తెరకెక్కాయి. ఈ ఏడాది ఈ జానర్ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఓ మూవీ వచ్చింది. అదిప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. అనంతరం మే నెలలో విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మన దేశంలో మాత్రం ఈ నెల 17 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు.
'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా ఆనందపడుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు సదరు కుటుంబాన్ని దారుణంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయపెట్టేలా ఉన్నాయి.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు)
ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు)
పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)
సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే
snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే..
మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు
Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి