© 2026 nimisham.in

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల దాహార్తిని తీరుస్తూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పయనించి వచ్చిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు, స్వయంగా కాలువలోనే నిల్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న గోదారమ్మకు పుష్పాలు సమర్పించి, జలహారతి ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు. పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకున్న అనంతరం, ఉద్విగ్నభరిత వాతావరణంలో గోదావరి ప్రవాహానికి సాష్టాంగ నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.బుధవారం పాయకరావుపేటలో జరిగిన ఈ చారిత్రక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, ఎంపీలు చింతకాయల విజయ్, సీఎం రమేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోలాటంతో కళాకారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.రూ.4,192 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన ఈ నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక, తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేందుకు జలవనరుల