© 2026 nimisham.in

మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్ పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్‌కు సొంత యూనిఫామ్ ఉంటుంది
… ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి.
యూనిఫామ్ డిజైన్‌ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది.
స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది.
ప్రతి స్కూల్‌కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్‌పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్‌నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి.
యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్‌ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి.