© 2026 nimisham.in

ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు – బాలలు (2026) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మినహా ఇతర దేశాలలో నివసిస్తున్న ప్రవాస తెలుగు బాలబాలికల కోసం ప్రత్యేకంగా...
ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు – బాలలు (2026) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మినహా ఇతర దేశాలలో నివసిస్తున్న ప్రవాస తెలుగు బాలబాలికల కోసం ప్రత్యేకంగా ‘ప్రవాస బాలల అంతర్జాల సాహితీ సమ్మేళనం’ నిర్వహింస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.
పద్య పఠనం విభాగంలో పాల్గొనే పిల్లలు రెండు తెలుగు పద్యాలు చదవాల్సి ఉంటుంది, దీనికి 2 నిమిషాల వ్యవధి కేటాయించారు. అలాగే కవితా పఠనం కోసం సొంత కవిత లేదా వేరొకరి కవితను చదవవచ్చు దీనికి కూడా 2 నిమిషాల సమయం ఉంటుంది. ఏకపాత్రాభినయానికి 2 నిమిషాల వ్యవధి ఉండగా, కథ చెప్పే విభాగంలో పాల్గొనేవారు తమ కథను చెప్పడానికి 5 నిమిషాల సమయం కేటాయించబడింది. ఇక ‘పాడనా తెలుగు పాట’ విభాగంలో లలిత గీతాలు లేదా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన పాటలు పాడుకోవచ్చు, దీనికి 3 నిమిషాల వ్యవధి నిర్ణయించారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహాక కమిటీ సభ్యుల తుది నిర్ణయం మేరకు, తెలుగు భాష, సంప్రదాయం, సంస్కృతికి విఘాతం కలిగించే ప్రదర్శన అంశాలు తిరస్కరిస్తారు లేదా నిలిపివేస్తారు. ఈ కార్యక్రమం 2026 సెప్టెంబర్ 26, శనివారం రోజున అంతర్జాల మాధ్యమంగా నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైనది. మరిన్ని వివరాలకు లేదా సందేహాల కొరకు సంధానకర్తలు రాధిక మంగిపూడి (+91 9029409696), ఫణి మాధవ్ కస్తూరి (+91 9121906969)లను సంప్రదించవచ్చు.